Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలరాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ పార్టీ 21 వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పిలుపు

నవగీతం ,కొత్తగూడెం:

సుజాతనగర్ ,కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 21 వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు డివిజన్ కమిటీలను ఎన్నుకునే దానిలో భాగంగా 21 డివిజన్ నందు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శినాగాసీతారాములు పాల్గొని ఆయన మాట్లాడుతూ 2029 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ , కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను , ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమం,అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ , పార్టీ పటిష్ట నిర్మాణం కొరకు కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని,కమిటీ సభ్యులు క్రమశిక్షణతో మెలుగుతూ పార్టీ పురోభివృద్ధికి కృషి చేయాలని ఆయన వారికి సూచించారు . ఈ కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు, 28వ డివిజన్ కార్పొరేటర్ శ్రీలక్ష్మీ,కాంగ్రెస్ 25వ డివిజన్ కార్పొరేటర్ కే కే,పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆళ్ల మురళి,బత్తుల కేశవరావు,బత్తుల వీరయ్య మరియు 21వ డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular