రైతుల పొలాల్లో మంచినీటి బోరేయించిన వైరా లయన్స్ క్లబ్
నవగీతం :వైరా ప్రతినిధి
వైరా మండల పరిధిలోని పుణ్యపురం గ్రామంలో ముద్దనూరు వెళ్లే దారిలో నిత్యం రైతులు వ్యవసాయకూలీలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు పశువుల సైతం ఎండ తీవ్రతకి నీటి కోసం అల్లాడుతున్నాయి. త్రాగునీటి అవసరాలను గుర్తించిన వైరా మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ, మురళీకృష్ణ లైన్స్ క్లబ్ వారు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ బోర్ ద్వారా పొలాలలో పనిచేసే రైతులకు శ్రామికులకు, పశువులకు సురక్షితమైన త్రాగునీరు అందుబాటులోకి వచ్చింది. పొలాలలో త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నల కష్టాలను గుర్తించిన గ్రామ సర్పంచ్ యంగల మరియమ్మ డాక్టర్ కాపా చంద్రకళ, మురళీకృష్ణ దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే వారు స్పందించి, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొత్త బోరును వేయించారు. ప్రస్తుత ఎండల దృష్ట్యా ఈ బోరు ఎంతోమందికి దాహార్తిని తీరుస్తుందని, స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాజ శ్రేయస్సు కోసం లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని గ్రామ ప్రజ లు కొనియాడారు. బోరు వేపించే కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యంగల మరియమ్మ, గ్రామ కార్యదర్శి గ్రామ పెద్దలు గ్రామ రైతులు, పలువురు ఉన్నారు.

