మోడల్ స్కూల్లో సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన మంత్రి అడ్లూరి.
నవగీతం, జగిత్యాల/వెల్గటూర్:
ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిధులు కేటాయిస్తున్నారని, విద్యార్థులు ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి మోడల్ స్కూల్లో సోమవారం సమ్మర్ క్యాంప్ ను మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థులకు గొప్ప స్థాయిలో విద్యను అందించాలని లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని అన్నారు. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.

పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేస్తున్నామని అన్నారు.కుమ్మర్ పల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు జగిత్యాల జిల్లాలో ప్రధమ స్థానంలో నిలిచినందుకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. మోడల్ స్కూల్ కిచెన్ షెడ్ నిర్మాణం కొరకు ఇప్పటికే రూపాయలు 10 లక్షలు కేటాయించామని మోడల్ స్కూల్ విద్యార్థులకు కావాల్సిన గ్రామంలో లెవలింగ్ చేయిస్తానని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ మాట్లాడుతూ విద్యార్థులు సమ్మర్ క్యాంప్ ఉపయోగించుకొని అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.వెల్గటూరు మండలం కిషన్ రావు పేటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు పూర్తి అయ్యేవిధంగా అధికారులు చొరవ తీసుకోవాలని మంత్రి సూచించారు.


