నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనేకమంది ఉద్యమకారుల త్యాగాలు, బలిదానాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు.అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ బాటలోనే నడుస్తోందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను ఆకర్షించడం తప్ప రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టడం లేదని పేర్కొన్నారు.2014 ఫిబ్రవరి 18న పార్లమెంటులో ప్రవేశపెట్టిన తెలంగాణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం వల్లే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. అనాడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు ప్రతిపక్ష నాయకురాలిగా సుష్మా స్వరాజ్ బలమైన మద్దతు ఇచ్చారని, బిల్లు ఆమోదం పొందడంలో బీజేపీ సహకారం కీలకమైందన్నారు.భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తామని తెలిపారు. అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమమే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలేటి నరేందర్ రెడ్డి, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, కౌన్సిలర్లు నిమ్మల నాగరాజు, సిరిపురం శ్రీలత-శ్రీనివాస్, నలవాల తిరుపతి, జుంబర్తి దివాకర్, మ్యాదరి అశోక్, ఓరుగంటి చందు, దురిశెట్టి మమత, డాక్టర్ శ్రీనివాస్ పుప్పాల, కొక్కు గంగాధర్ ఆముద రాజు, గుంటుక సదాశివ్, మరిపెళ్లి సత్యం, పిండేరు భానుప్రియ, ఇట్యాల రాము, గాదాసు రాజేందర్, కొప్పు భాస్కర్, గర్వందుల రమేష్, కాశెట్టి తిరుపతి, ముద్దం నాగరాజు, మేడిపల్లి పుష్పారెడ్డి, చెన్నడి మధురిమ, సింగం పద్మ, మామిడల కవిత, దూరిశెట్టి రమణ తదితరులు పాల్గొన్నారు.

