నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు , మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన రూ.10 లక్షల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.అదే విధంగా, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును కాశవత్రి లక్ష్మి కి అందజేశారు.సిర్పూర్ గ్రామానికి చెందిన మహిళా సంఘం డెవలప్మెంట్ కింద రూ. 3 లక్షల మంజూరు పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జువ్వాడి మాట్లాడుతూ. గ్రామల అభివృద్ధికి కట్టుబడి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తామని నర్సింగరావు అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య, ఏ యం సి చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఎల్లాల జలపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాట్ల సోమయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, వెంకట్ రెడ్డి, కనుముల వెంకటేష్, పెంట సౌజన్య శ్రీనివాస్ నాయకులు పుండ్ర శ్రీనివాస్ రెడ్డి రొండ్ల రాజరెడ్డి, ఆనంద్ గౌడ్ ,సిరిపురం రవీందర్, ఎర్ర భూమయ్య నల్ల బాపు రెడ్డి ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, మహిళలు, యువకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


