Wednesday, June 17, 2026
ads
Homeఖమ్మంలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నంబూరు మోహన్ రావు కి ఘన సన్మానం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నంబూరు మోహన్ రావు కి ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

నవగీతం ,తల్లాడ ప్రతినిధి

తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోడూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం రోజున తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సంఘం కార్యవర్గ సభ్యులు గా నంబూరు మోహన్ రావు నీ నియమించినందుకు ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాగేశ్వరరావు డిస్టిక్ కోఆర్డినేటర్ తల్లాడ గ్రామ ఉపసర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ…. మన తల్లాడ గ్రామవాసి నంబూరి మోహన్ రావు రాష్ట్రస్థాయిలో ఆర్యవైశ్య కార్యవర్గ సభ్యులుగా నియమించినందుకు వారిని తల్లాడ లయన్స్ క్లబ్ తరఫున ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది. వారు ఇంకా మరెన్నో శిఖరాలను అవరోధించి పై స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో దగ్గుల నారాయణరెడ్డి , రేగళ్ల పుల్లారెడ్డి ,బెల్లంకొండ ఆంజనేయులు, శీలం వెంకటరెడ్డి ,మిట్టపల్లి కృష్ణ యాచవరపు వెంకటరెడ్డి ,కటికి వెంకటేశ్వరరావు మొదలగువారు పాల్గొని మోహన్ రావు అభినందనలు తెలియజేసినారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular