Saturday, April 25, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఅమరజీవి శంకర్ గౌడ్ త్యాగం వృధా పోనివ్వం

అమరజీవి శంకర్ గౌడ్ త్యాగం వృధా పోనివ్వం

📰 Generate e-Paper Clip

కన్నీటి వీడ్కోలు పలికిన కోరుట్ల ఆర్టీసీ కార్మికులు

నవగీతం,కోరుట్ల ప్రతినిధి :

కోరుట్ల ఆర్టీసీ డిపో వద్ద మూడవ రోజుకు చేరిన సమ్మెలో భాగంగా, నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య పట్ల కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను వ్యక్తం చేశారు. తమ హక్కుల సాధన కోసం ప్రాణాలర్పించిన తోటి కార్మికుడి మృతికి సంతాపంగా డిపో ఆవరణలో ఒక నిమిషం పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించిన కార్మికులు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండివైఖరి వీడాలని,డిమాండ్లు నెరవేరే వరకు తమ శాంతియుత పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించగా, శంకర్ గౌడ్ మరణం సమ్మె శిబిరంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular