Friday, May 1, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి

మాల్లాపూర్ మండలం కొత్త ధాంరాజ్ పల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు ను ఉప సర్పంచ్ బద్దం హరీష్ రెడ్డి, బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎలేటి మహేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ బద్దం సరిత కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లో ఉపాధి హామీ పథకం కీలకమైందని అన్నారు.ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.ఉదయము పనులకు వచ్చే ముందు రాగి జావా అంబలి మరియు నిమ్మ రసం లాంటివి  తీస్కొని రావాలని సూచించారు. ఒక్క వేల ఎవరికైన ఎండకు తల తింపినట్టు అయితే వెంటనే ఓఆర్ ఎస్ పాకెట్టు నీళ్లలో కలుపు కొని త్రాగాలని ఉదయం 6 గంటల వరకు వచ్చి తొందరగా పని ముగించుకొని వెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మామిడి రాజేందర్, బెజ్జరపు సంతోష్, అందే గంగారాం, కాటి పెల్లి ప్రవళిక రాజేందర్, పొలస లక్ష్మి బ్రహ్మయ్య, సుతారి శారద, జవిడి భూమేష్, బద్దం మహిపాల్, బెజ్జరపు రవి, వెల్మల మధు,నేరేళ్ల మారుతి,బద్దం చందు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular