Friday, September 18, 2026
ads
Homeఖమ్మంరైతులు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం

రైతులు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం

📰 Generate e-Paper Clip

టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు

నవగీతం ,కొత్తగూడెం:

ప్రజా పాలనా,ప్రగతి ప్రణాళిక-రైతు వారోత్సవంలో భాగంగా సుజాతనగర్ రైతు వేదికలో రైతు సహకార సంఘం ఆధ్వర్యంలొ ఏర్పాటు చేసిన రైతు అవగాహనా సమావేశంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ పసుపులేటి వీరబాబు,సోసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావుతో కలిసి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొన్నారు.ఈ సందర్బంగా నాగా సీతారాములు మాట్లాడుతు రైతులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఉపయోగించుకోవాలని అన్నారు. అలాగే రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పావలా వడ్డీ ఋణాలు తీసుకుని,వ్యవసాయం అభివృద్ధి చేసుకోవాలని కోరారు. పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకలు పెంపకానికి ప్రభుత్వం ఋణాలు మంజూరు చేస్తుందని తెలిపారు. రైతు బంధు, రైతు భీమా రైతులకు రక్షణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాలను వివరిస్తు ఏఏ పంటలకు ప్రస్తుతం బహిరంగ మార్కెట్ డిమాండ్ ఉందొ క్లుప్తంగా రైతులకు వివరించారు .ప్రభుత్వంతో పాటుగా వ్యవసాయ అధికారులు రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని వారి సలహాలు సూచనలు తీసుకుని అధిక దిగుబడి పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, సుజాతనగర్ తాహసిల్దార్ కృష్ణ ప్రసాద్, సుజాతనగర్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నర్మద, కార్పొరేటర్లు చింతలపూడి శ్రావణి దంపతులు, బానోత్ అనిత దంపతులు, సింగభూపాలెం సర్పంచ్ కిన్నెర వెంకన్న,కొత్తఅంజనాపురం సర్పంచ్ వజ్జా రామారావు,బేతంపూడి సర్పంచ్ వాంకుడోత్ శ్రీకాంత్,సొసైటీ డైరెక్టర్లు రామచందర్, విజయలక్ష్మి ,పోటు వెంకటేశ్వరరావు, సీఈఓ రమణారెడ్డి,మాజీ సొసైటీ చైర్మన్ కంచర్ల కామేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మయ్య, వడుగు శ్రీను, వడుగు. నరసింహారావు,కొమారి రవీందర్, సీపియం పార్టీ నాయకులు వీర్ల రమేష్,శ్రీను, పుల్లారావు,ఆదర్శ రైతులు నంబూరి శేఖర్,శ్రీను యువజన కాంగ్రెస్ నాయకులు గుగులోత్ కోటేష్ ,చేతుల మహేష్ సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular