ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగిత్యాల ఎమ్మెల్యే పేర్కొన్నారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని, గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి అత్యధిక స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియ, కేంద్రంలో కల్పించిన వసతి సదుపాయాలు, గన్ని సంచుల లభ్యత తదితర అంశాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.జగిత్యాల నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు లక్ష క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు చేశాం. రైతులు తీసుకొచ్చే చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం” అని తెలిపారు. లక్ష్మీపూర్ గ్రామ రైతులు మాట్లాడుతూ, తాము కోరిన వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేయడమే కాకుండా, అవసరమైన సమయంలో గన్ని సంచులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా సభ్యులు ముప్పాళ్ల రామచందర్ రావు, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, ఉపసర్పంచ్ సత్తిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ నక్కల రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచులు తిరుపతి రెడ్డి, చెరుకు జాన్, గర్వందుల గంగన్న, మాజీ ఆత్మ చైర్మన్ ఏలేటి రాజిరెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పురిపాటి రాజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బాపు రెడ్డి, ఏనుగు గంగారెడ్డి, గడ్డం గోపాల్ రెడ్డి, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


