Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలగంగాధరలో బీఆర్ఎస్ రాస్తారోకో

గంగాధరలో బీఆర్ఎస్ రాస్తారోకో

📰 Generate e-Paper Clip

బండి సంజయ్ రాజీనామా చేయాలి సుంకే రవిశంకర్

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని గంగాధర మండల కేంద్రం మధురానగర్ చౌరస్తాలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నాయకత్వంలో కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు.బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ “బేటీ బచావో – బేటీ పడావో” అంటూ నినాదాలు చేసే బీజేపీ నాయకులు మహిళల రక్షణ విషయంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. మైనర్ బాలికకు సంబంధించిన తీవ్రమైన కేసులో నిందితుడిని వెంటనే చట్టానికి అప్పగించాల్సిన బాధ్యత బండి సంజయ్‌పై ఉందన్నారు. కేసు నమోదై తొమ్మిది రోజులు గడిచినా ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, సోషల్ మీడియా వారియర్స్ పెద్ద ఎత్తున పోరాటాలు చేయడంతోనే ప్రభుత్వం స్పందించిందన్నారు. తాత్కాలిక అరెస్టులు సరిపోవని, నిందితుడికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. కేసును నీరుగార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని,రాష్ట్ర ప్రభుత్వం–బీజేపీ నేతల మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. అదేవిధంగా బండి సాయి భగీరథ్‌కు డ్రగ్ టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మహిళల భద్రత, మైనర్ బాలికలకు న్యాయం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. మైనర్ బాలికకు పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular