Thursday, September 24, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలవరి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

వరి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

📰 Generate e-Paper Clip

ఆకస్మిక తనిఖీల్లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశాలు

నవగీతం,జగిత్యాల ప్రతినిధి :

జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం బీర్పూర్ మండలంలోని చర్లపల్లి, నరసింహులపల్లి, కందెనకుంట, తుంగూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు తెలిపారు.ధాన్యం తూకం, నిల్వ, రవాణా ప్రక్రియల్లో నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చూడాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే ఆన్‌లైన్ డాటా ఎంట్రీ పూర్తి చేసి రైతుల ఖాతాల్లో సకాలంలో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా మిల్లుల వద్ద ధాన్యాన్ని త్వరితగతిన అన్‌లోడింగ్ చేసే విధంగా సమన్వయం చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచి వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించాలని తెలిపారు.ఈ తనిఖీల్లో డీఎస్ఓ జితేందర్ రెడ్డి, తహసీల్దార్ సుజాత, సంబంధిత అధికారులు, రెవెన్యూ సిబ్బంది, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular