Monday, September 21, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఅర్హులైన ప్రతి ఓటరు సర్ ప్రకీయాలో వివరాలు అందజేయాలి

అర్హులైన ప్రతి ఓటరు సర్ ప్రకీయాలో వివరాలు అందజేయాలి

📰 Generate e-Paper Clip

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజి సదానంద చారి

నవగీతం, మల్లాపూర్:

అర్హుడైన ప్రతి ఓటరు సర్ కార్యక్రమంలో పాల్గొని తమ వివరాలు ఈనెల 24 వరకు సంబంధిత భి ఎల్ వో లకు అందజేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజి సదానంద చారి అన్నారు మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ ఐ ఆర్ ఫై అవగాహన అనే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సదానందచారీ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్ కార్యక్రమానికి ఈనెల 24 తుది గడువుగా నిర్ణయించారని ఈలోగా అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను స్థానిక బిఎల్వోలకు అందజేయాలని కోరారు ఇందుకు పార్టీ శ్రేణులు ముందుండి ఓటరు లకు తగిన విధంగా సహాయ పడాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగు రాజారెడ్డి నిమ్మల రాజేశం ఇంద్రాల పవన్ కిషన్ లక్ష్మణ్ దురిశెట్టి బ్రహ్మయ్య శ్రీనివాస్ ప్రకాష్ నరేంద్ర సురేష్ సంతోష్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular