Sunday, September 20, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమెట్‌పల్లిలో పలువురికి ఘన సన్మానం

మెట్‌పల్లిలో పలువురికి ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి:

ఇటీవల నూతనంగా ఎన్నికైన చైతన్య నగర్-1 సంఘం అధ్యక్షులు పుల్లూరి నవీన్, కార్యదర్శి ఎల్మి రవి, కోశాధికారి నరేంద్రల రవి లను మెట్‌పల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కోట సుమన్ వారి నివాసంలో ఘనంగా సన్మానించారు.అదేవిధంగా వాసవి క్లబ్ జోన్ చైర్మన్‌గా నియమితులైన కోట కిరణ్ కుమార్, జిల్లా ప్రెస్ అక్రిడిటేషన్ కమిటీ సభ్యునిగా నియమితులైన బండారి శివ కుమార్ ఉత్తమ విలేకరిగా పురస్కారం అందుకున్న బాశెట్టి హరీష్ ను శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కోట సుమన్, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి బాధ్యతాయుతమైన పదవులకు ఎంపిక కావడం అభినందనీయమని పేర్కొన్నారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.సన్మానం పొందిన వారు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సమాజ సేవకు మరింత అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, ప్రముఖులు, స్నేహితులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular