Monday, August 3, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలముత్యంపెట్ చెక్కర కర్మాగారం తెరిపించకపోతే భారీ ఆందోళన

ముత్యంపెట్ చెక్కర కర్మాగారం తెరిపించకపోతే భారీ ఆందోళన

📰 Generate e-Paper Clip

బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి

నవగీతం,మల్లాపూర్:

మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గోపిడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గత సంవత్సరం చెరుకు రైతుల సమస్యల పరిష్కారం కోసం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని మల్లాపూర్ నుంచి ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఆ పాదయాత్ర ముగిసి సంవత్సరం పూర్తయినా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చెరుకు రైతుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని షుగర్ ఫ్యాక్టరీ తెరవడంపై ఊసు ఎత్తడం లేదని మండిపడ్డారు.రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందూరు పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి సమక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గోపిడి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.ఈ మీడియా సమావేశంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు,ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాసన్ తెలంగాణ స్టేట్ కౌన్సిలర్ నెంబర్ నరేందర్ రెడ్డి  నిజామాబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదాశివ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మి మరియు వివిధ బిజెపి మోర్చా అధ్యక్షులు మరియు బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్జిలు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular