Tuesday, August 11, 2026
ads
Homeఎడిటోరియల్బీడీ కార్మికులకు ‘చేయూత’ ఆప్షన్ లేకపోవడంపై ధర్నా

బీడీ కార్మికులకు ‘చేయూత’ ఆప్షన్ లేకపోవడంపై ధర్నా

📰 Generate e-Paper Clip

మల్లాపూర్, ఆగస్టు 11,(నవగీతం):ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పెన్షన్లలో భాగంగా బీడీ కార్మికులకు సంబంధించిన చేయూత ఆప్షన్ అప్లికేషన్ ఫామ్ లో లేకపోవడం బాధాకరమని పేర్కొంటూ మల్లాపూర్ మండలానికి చెందిన బీడీ కార్మికులు మంగళవారం మండల కేంద్రంలోని భరతమాత కోడలి వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీడీ కార్మికులు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న బీడీ పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అప్లికేషన్ ఫామ్‌లో బీడీ కార్మికులకు సంబంధించిన ‘చేయూత’ ఆప్షన్‌ను చేర్చాలని డిమాండ్ చేశారు.సమాచారం అందుకున్న మల్లాపూర్ ఎస్సై అనిల్ కుమార్ ఎంపీడీవో అల్వాల శ్రీకాంత్ ధర్నా స్థలానికి చేరుకుని బీడీ కార్మికులతో మాట్లాడారు.వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, బీడీ కార్మికులకు పెన్షన్ అందే విధంగా నివేదిక పంపుతామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ధర్నాను విరమించారు.అనంతరం బీడీ కార్మికులు తమ సమస్యలను వివరిస్తూ ఎంపీడీవో అల్వాల శ్రీకాంత్ కు వినతిపత్రం అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular