నవగీతం,కోరుట్ల:
కోరుట్ల పట్టణం కల్లూరు రోడ్డు ఎస్.ఆర్.ఎస్పీ క్యాంప్ గడి ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులచే పట్టణ పూర విధులలో ప్రభాత భేరి ర్యాలీ నిర్వహించి, జెండా ఆవిష్కరణ చేశారు.ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ వచ్చి విద్యార్థులతో సరదాగా ముచ్చటిస్తూ వారి మధ్య నేలపైన కూర్చున్నారు. పిల్లలు వారితో కేరింతలు కొడుతూ ఆనందాలు పంచుకున్నారు. కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ్ రావు పాఠశాలకు విచ్చేయగా వారికి ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 289 ఉంది.వారికి సరిపడా తరగతి గదులు లేవని వారి దృష్టికి తీసుకెళ్లారు. జువ్వాడి మాట్లాడుతూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రెండు తరగతి గదులు మంజూరు చేయిస్తా అని హామీ ఇచ్చారు.గడి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల ఉపాధ్యాయ బృందానికి అభినందించారు.

గడి పాఠశాలను ఆదర్శంగా తీసుకొని అన్ని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని కోరారు.చైర్మన్ మంగ మాట్లాడుతూ విద్యార్థుల బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలవాలని కోరారు.గణతంత్ర దినోత్సవనీ పురస్కరించుకొని విద్యార్థులకు ఆటలు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసారు. విద్యార్థుల సాంస్కృతిక,నృత్య ప్రదర్శన సభికులకు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు , ఉపాధ్యాయులు అబ్దుల్ రవూఫ్,పూర్ణ చందర్, రాజా కుమార్, ధన లక్ష్మి, సుమలత, సరస్వతి, భవాని, విద్యార్థిని విద్యార్థులు వారి తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.

