Thursday, March 12, 2026
ads
Homeఎడిటోరియల్కరీంనగర్–జగిత్యాల హైవే అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

కరీంనగర్–జగిత్యాల హైవే అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

📰 Generate e-Paper Clip

ప్రారంభానికి నితిన్ గడ్కారి ని కలిసిన బండి సంజయ్ కుమార్

నవగీతం, కొడిమ్యాల :

కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి నాలుగు లైన్ల పనుల ప్రారంభోత్సవానికి కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారి సమయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. దిల్లీలో జరిగిన సమావేశంలో కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు విస్తరించనున్న నేషనల్ హైవే 563 ను నాలుగు లైన్లుగా విస్తరించే పనుల ప్రారంభోత్సవానికి హాజరుకావాలని బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి నితిన్ గట్కారి ని ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుందని ఆయన పేర్కొన్నారు.కరీంనగర్ జిల్లా ప్రజల దీర్ఘకాలిక అభిలాషగా ఉన్న ఈ నాలుగు లైన్ల రహదారి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ రహదారి అభివృద్ధి పూర్తయితే కరీంనగర్–జగిత్యాల మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో పాటు వాణిజ్య, రవాణా రంగాలకు కూడా గణనీయమైన ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోందని బండి సంజయ్ కుమార్ తెలిపారు. త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గట్కారి సమక్షంలో ఈ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించే అవకాశముందని సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular