నవగీతం,మాల్లాపూర్
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో శుక్రవారం వసంత పంచమి పురస్కరించుకొని అంగన్వాడి పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సర్పంచ్ తేలు నరేష్ పలకలు, బలపాలు నోట్ బుక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, సర్పంచు తేలు నరేష్, ఉపసర్పంచ్ వంగ పోతయ్య, పంచాయతీ కార్యదర్శి మోబిన్, హనుమాన్ల అభిలాష్, అంగన్వాడి టీచర్లు ఆమెటి శ్రీలత, దాసరి లక్ష్మి, సుద్దాల కృష్ణవేణి తోపాటు పలువురు పాల్గొన్నారు.

