Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఅటవీ ప్రాంత ప్రజలందరికీ మెరుగైన సదుపాయాలు కల్పించాలి.కలెక్టర్

అటవీ ప్రాంత ప్రజలందరికీ మెరుగైన సదుపాయాలు కల్పించాలి.కలెక్టర్

📰 Generate e-Paper Clip

నవగీతం, నిర్మల్

నిర్మల్ జిల్లాలోని అటవీ ప్రాంత ప్రజలందరికీ మెరుగైన సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో జిల్లా స్థాయి అటవీ కమిటీ (డిఎల్ సి) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా, విద్యుత్, తదితర మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు అటవీ శాఖ అధికారులు సహకరించాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డిఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డిఓ రత్నకళ్యాణి, ఎడి సర్వే & ల్యాండ్ రికార్డ్ ఆర్. సుదర్శన్, పిడి హౌసింగ్ రాజేశ్వర్, రెవెన్యూ, ఇంజనీరింగ్,విద్యుత్ శాఖల అధికారులు, తహసిల్దార్ లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular