నవగీతం,మల్లాపూర్
మల్లాపూర్ ప్యాక్స్ అధ్వర్యంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజషన్ (FPO) స్కీం లో అర్హత సాధించేందుకు ప్రత్యేక షేర్ కాపిటల్ కలెక్షన్ అవగాహన మల్లాపూర్ ప్యాక్స్ ఆధ్వర్యంలో గుండంపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అతడ్పుల పుష్పలత నర్సయ్య మాట్లాడుతూ ఈ స్కీం రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ స్కీము ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఈ స్కీం యొక్క యొక్క విధివిధానాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ , ఛైర్మెన్ అతడ్పుల పుష్ప లత నర్సయ్య ,ఉప సర్పంచు లు, వార్డు సభ్యులు, రైతులు, పంచాయితీ కార్యదర్శి, నారాయణ సొసైటీ కార్యదర్శి భూమేష్ , సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు

