నవగీతం, కోడీమ్యాల
కొడిమ్యాల మండలంలోని 24 గ్రామాల ఉపసర్పంచుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సమావేశం నిర్వహించి మండల ఉపసర్పంచ్‌ల ఫోరం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం అధ్యక్షుడిగా గుర్రం నరసయ్య గౌడ్‌ను ఎంపిక చేశారు.ఉపాధ్యక్షులుగా జిడిగే సాయికుమార్, గంగుల శ్రీనివాస్ రెడ్డిలు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఎడమలపల్లి సంతోష్ కుమార్, సహాయ కార్యదర్శిగా గోనెపల్లి ప్రశాంత్, కోశాధికారిగా బోనగాని మల్లేశంను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా ఆర్. తిరుపతిరెడ్డి, ఏ. మల్లేశం, జె. నరసయ్య, జి. శ్రీలత, ఎల్. ప్రకాష్‌లను ఎంపిక చేశారు.ఈ ఎన్నికలు ఉపసర్పంచుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జరిగాయి.

