నవగీతం, కోడీమ్యాల
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులోని బస్టాండ్ ముందు ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహం సమీపంలో గతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా బొమ్మల వ్యాపారుల దుకాణాలు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జీవనాధారం కోల్పోయిన దుకాణాల యజమానులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు.ఈ సహాయం అందించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు బాధితులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అతి తక్కువ సమయంలో స్పందించి సహాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అగ్నిప్రమాదంలో దుకాణాలు కోల్పోయిన బాధితులతో పాటు స్థానిక సర్పంచ్ దారం ఆదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరి, శ్రీనివాస్ గౌడ్, ముత్యం.శంకర్ గౌడ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

