నవగీతం, గుంటూరు
నందవరం మండల పరిధిలోని నాగలదిన్నెలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న సూక్తి చంద్రిక మరో పుస్తకావిష్కరణ గుంటూరులోని ఆంధ్ర సరస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో పుస్తక ఆవిష్కరణ ఘనంగా చేసారు. ప్రముఖ సాహితీకారుడు గుత్తికొండ సుబ్బారావు, ప్రసిద్ధ కవి డా. జి.వి. పూర్ణచందు, పెన్మేత్స సత్యనారాయణ మున్నగు వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం గమనార్హం.పిదప బహు గ్రంథకర్త, వక్త గద్వాల సోమన్నను శాలువా, తెలుగుతల్లి మెమొంటో, ప్రశంసాపత్రం,మెడల్ తో ఘనంగా సత్కరించారు

