Thursday, April 16, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలగుండంపల్లిలో వార సంత ను ప్రారంభించిన సర్పంచ్

గుండంపల్లిలో వార సంత ను ప్రారంభించిన సర్పంచ్

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్

మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామపంచాయతీ దగ్గర శుక్రవారం వారసంత ను సర్పంచ్ దప్పుల పద్మ నరసయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇకనుండి ప్రతి శుక్రవారం గ్రామంలో గ్రామపంచాయతీ వద్ద అంగడి నిర్వహించడం జరుగుతుందని ఈ వారసంతలో కూరగాయలు, పండ్లు, బట్టలు,నిత్యవసర సరకులు అన్ని రకాల వస్తువులు లభిస్తాయి. కావున గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలకు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పుష్పలత నరసయ్య, ఉప సర్పంచ్ గంగాధర్, వార్డ్ సభ్యులు రమేష్,శ్రీను,వి డి సి సభ్యులు, గున్నాల విజయ్, జక్కుల అనిల్,గుయ్య శ్రీశైల మల్లేష్, చాకలి నరేష్, ఇట్టేడి సాగర్, మామిడి రవి, కొండయ్య, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular