Friday, April 24, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

నవగీతం, కొడిమ్యాల

కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ గ్రామంలోని మండల ప్రజా పరిషత్ స్కూల్‌–జిల్లా పరిషత్ హై స్కూల్‌,లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జ్యోష్ణాదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మహానాయకుల వేషధారణలతో నిర్వహించిన ప్రభాత భేరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అనంతరం పాఠశాలల సముదాయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందడిగా సాగాయి. నూతన గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, దాతలు, పాఠశాల శ్రేయోభిలాషులను సన్మానించారు.అలాగే విద్యార్థులకు బహుమతులు అందజేసి, తీపి పదార్థాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ తైదల అంజయ్య, ఉపసర్పంచ్‌ పర్రెం ప్రశాంత్‌ రెడ్డి, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జ్యోష్ణాదేవి, దేవరాజం, భూపతి రెడ్డి, ఉపాధ్యాయ బృందం,పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular