Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుదుబ్బ రాజన్న జాతర పోస్టర్ ఆవిష్కరణ

దుబ్బ రాజన్న జాతర పోస్టర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

నవగీతం వేములవాడ

వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో కొలువైన శ్రీ దుబ్బ రాజ రాజేశ్వర స్వామి వారి మాఘమాస అమావాస్య జాతర ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న సందర్భంగా జాతరకు సంబంధించిన పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు., ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా జాతర పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దుబ్బ రాజన్న జాతర భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని, గ్రామీణ సంప్రదాయాలు, ఆచారాలకు అద్దం పట్టే ఈ జాతరను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular