Thursday, April 23, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలపత్రికలు వారధిలా ఉండాలి: డీఎస్పీ అడ్లూరి రాములు

పత్రికలు వారధిలా ఉండాలి: డీఎస్పీ అడ్లూరి రాములు

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి

పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని ప్రజల సమస్యలను వెలికితీసి పరిష్కారం జరిగేలా వార్తలు ఉండాలని మెట్‌పల్లి డీఎస్పీ అడ్లూరి రాములు అన్నారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ప్రజా కలం దినపత్రిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మహమ్మద్ అజీమ్ ఆధ్వర్యంలో  ప్రజాకలం దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాకలం దిన పత్రిక ప్రజా సమస్యల వెలికి తీసి సమస్యల పరిష్కారం లో ముందుంటుందని అన్నారు. పత్రికలు ప్రజలకు అవగాహన కల్పించే వార్తలను ప్రచురించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  మెట్‌పల్లి రూరల్ రిపోర్టర్ కుర్ర రాజేందర్, టీయూడబ్ల్యూజే ఐజేయు. జగిత్యాల జిల్లా ఈసీ మెంబర్ షేక్ సాజిత్, మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ఉపాధ్యక్షుడు జంగం విజయ్, ఈసీ మెంబర్ పోనాగానీ మహేందర్, మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్, శశి కుమార్, ఆర్గనైజర్ సెక్రెటరీ మొహమ్మద్ సమీ టీయూడబ్ల్యూజే హెచ్ 143 ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పుల్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular