Friday, April 17, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలపేద,మధ్యతరగతి విద్యార్థులకు వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల

పేద,మధ్యతరగతి విద్యార్థులకు వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గల పేద, మధ్య తరగతి విద్యార్థులకుమెట్ పల్లి డిగ్రీ కళాశాల వరమని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య అన్నారు. బడి – బాట కార్యక్రమంలో భాగంగా మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది ఆధ్వర్యంలో మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం రోజున అడ్మిషన్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో గల పేద,మధ్య తరగతి విద్యార్థులకు మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒక వరం వంటిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంటర్మీడియెట్ లేదా తత్సమానమైన అర్హత గల విద్యార్థులకు ఈ కళాశాల ఎంతో సౌకర్యంగా ఉంటుందని అన్నారు.కళాశాలలో చేరిన విద్యార్థులకు హాస్టల్ వసతి,కంప్యూటర్ ల్యాబ్, ఉపకార వేతనాల మంజూరు వంటి సౌకర్యాలతో పాటు క్విజ్, ఉపన్యాస,వ్యాస రచన,క్రీడలు వంటి పోటీలను నిర్వహించి, అన్ని రంగాలలో నైపుణ్యాలను పెంపొందించి, ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుతామని ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య స్పష్టం చేశారు.కళాశాల వైస్ ప్రిన్సిపాల్ దేవన్న మాట్లాడుతూ, కళాశాలలో అనుభవం గల ఉపన్యాసకులు ఉన్నారని,అడ్మిషన్ లను పెంచటానికి కళాశాల సిబ్బంది శాయశక్తులా కృషి చేస్తుందని అన్నారు.మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే అడ్మిషన్ లు తీసుకోవాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బండి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అకాడమిక్ కో- ఆర్డినేటర్ బి. రాజేందర్, కామర్స్ హెచ్ ఓ డి ఏ.మనోజ్ కుమార్, కళాశాలల ఉపన్యాసకులు అంజయ్య, శ్రీకాంత్, శ్రీనివాస్, నరేష్, మహేష్,రికార్డు అసిస్టెంట్ వై. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular