Tuesday, April 14, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలనాచుపల్లిలో సర్పంచ్ బొడ్డెల్లి నాగమణికి ఆత్మీయ సన్మానం

నాచుపల్లిలో సర్పంచ్ బొడ్డెల్లి నాగమణికి ఆత్మీయ సన్మానం

📰 Generate e-Paper Clip

నవగీతం,కొడిమ్యాల:

కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన సర్పంచ్ బొడ్డెల్లి నాగమణికి గ్రామ యువత ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.జుట్టవేణి పోశాలు, గడ్డం రమేష్ నేతృత్వంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామ అభివృద్ధిపై సర్పంచ్ నాగమణికి ఉన్న అంకితభావాన్ని, ఆమెపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని గౌరవిస్తూ ఈ సన్మానం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ యువత శాలువాలతో కప్పి, పూలమాలలు వేసి సర్పంచ్‌ను ఘనంగా సత్కరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించడం గ్రామ ప్రజల సంపూర్ణ మద్దతుకు నిదర్శనమని వారు పేర్కొన్నారు.జుట్టవేణి పోశాలు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో సర్పంచ్ నాగమణి చురుకైన పాత్ర పోషిస్తారని, గ్రామ యువత అంతా ఆమెకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.సర్పంచ్ బొడ్డెల్లి నాగమణి మాట్లాడుతూ, తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, నాచుపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular