నవగీతం,జగిత్యాల:
జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కోడ్ ముగిసే వరకు ప్రజల నుంచి వినతుల స్వీకరణ ఉండదని, ఆ తర్వాతే యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మార్పును జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

