Tuesday, April 14, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలబిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన

బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన

📰 Generate e-Paper Clip

నవగీతం,ఇబ్రహీంపట్నం:

కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం గోధుర్ గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దశరథ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు సాత్ పడి పురుషోత్తం ఆధ్వర్యంలో కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారని నిరసన కార్యక్రమం చేపట్టారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షపూరిత వ్యవహారాలు, రాజకీయ కుట్రలు ఆపాలని తీవ్రంగా మండిపడ్డారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు “రేవంత్ రెడ్డి రాజకీయ కుట్రలు నశించాలి” అంటూ నినాదిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దశరథరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు సాత్ పడి పురుషోత్తం నాయకులు జాజాల జగన్ రావు, నల్ల తిరుపతిరెడ్డి, ఒడ్డం శ్రీనివాస్, పడాల రాజన్న, ఎండి ముజీబ్, ఎండి రహీం, కమ్మరి జనార్ధన్,నితీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular