మడుపల్లి గోపాలరావు సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి.
నవగీతం,మధిర ప్రతినిధి:
మధిర మండలం మల్లారం గ్రామంలో శనివారం రోజున ఎస్టీ సబ్ ప్లాన్ నుండి సుమారుగా 25 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం కొరకు ఐటిడిఏ నుండి ఏ ఈ యశ్వంత్ గ్రామంలో కొలతలు ఇతర పనులు ప్రారంభం కొరకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొని పనులు నిర్వహిస్తుండగా స్థానిక మల్లారం గ్రామ ప్రజలు సర్పంచ్ మందడపు లక్ష్మి మరియు వార్డు సభ్యులు సంబంధిత అధికారులను సమాచారం గ్రామపంచాయతీకి ఎందుకు అందించలేదని ప్రశ్నించగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు సమాచారం ఇవ్వలేకపోయామని ఐటీడీఏ ఏఈ యశ్వంత్ పొరపాటు జరిగిందని ఒప్పుకొని పనులను నిలిపివేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కరివేద రాంబాబు మరికొంతమంది రాష్ట్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది నీకు చెప్పేది ఏంటి నువ్వు ఒక మహిళ వి నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఏం చేసుకుంటావో చేసుకోపో మరియు కొన్ని అసభ్య పదాలతో మహిళా సర్పంచును అవమానకరంగా మాట్లాడి తీవ్రంగా అవమానపరిచారు. ప్రశ్నిస్తే మాది అధికార పార్టీ అని మాకు బట్టి ఉన్నారని మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వాదించడం సరైనదా?ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు మల్లారం గ్రామంలో పంచాయతీ సర్పంచ్ మందరపు లక్ష్మి వార్డు సభ్యులు సిపిఎం నాయకులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ… మహిళా సర్పంచులను అవమానపరచటం హేయమైన చర్య అని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఎన్నికలు పూర్తయిన తర్వాత అందరూ కలిసికట్టుగా పని చేయాల్సింది పోయి గ్రామంలో రాజకీయ కక్షలు పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార శైలి ఉంది అని అన్నారు. పంచాయతీరాజ్ చట్ట ప్రకారం గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా గ్రామపంచాయతీ సర్పంచులు వార్డు సభ్యులు భాగస్వామ్యం కావాల్సి ఉంటుందని అలాంటి నిబంధనను ఉల్లంఘించి కనీసం ఒక్క వార్డు సభ్యులు కూడా లేని కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లారం గ్రామపంచాయతీ అభివృద్ధి పనుల్లో అధికారులు ఆదేశాలు చేస్తారని ప్రశ్నించారు మహిళా సర్పంచులు నో ప్రతిపక్ష పార్టీ సర్పంచులను అగౌరవపరచటమే కాంగ్రెస్ పార్టీ విధానమా ? అని ప్రశ్నించారు. ఈ సంఘటనపై తక్షణం ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు శీలం నరసింహారావు మండల కార్యదర్శి మంద సైదులు పట్టణ కార్యదర్శి పడకండి మురళి, సర్పంచ్ మందడపు లక్ష్మి మాజీ సర్పంచ్ మందడపు ఉపేంద్ర రావు, డివిజన్ నాయకులు పాపినేని రామ నరసయ్య, మహిళా సంఘం నాయకులు గౌరరాజు ధనలక్ష్మి, బట్ట రమ, వార్డు సభ్యులు షేక్ సైదులు, వినయ్ కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు

