Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఅక్షరాస్యత శాతాన్ని పెంచడానికి అమ్మకు అక్షరమాల ఎంతో ఉపయోగం

అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి అమ్మకు అక్షరమాల ఎంతో ఉపయోగం

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్:

మహిళల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి అక్షర వికాసం అమ్మకు అక్షరమాల ఎంతో ఉపయోగమని సర్పంచ్ పద్మ అన్నారు. మల్లాపూర్ మండలం గుండంపల్లి మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో అమ్మకు అక్షరమాల పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పద్మ మాట్లాడుతూ.. గ్రామంలో అక్షరాస్యత శాతాన్ని పెంచడం మహిళలను సాధికారత వైపు నడిపించడం మహిళలు తమ సంతకం చేయడం, బ్యాంకు పనులు, దైనందిన జీవితంలో అక్షరజ్ఞానంతో స్వతంత్రంగా వ్యవహరించడానికి అమ్మకు అక్షరమాల పరీక్షలు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  దప్పుల పద్మ నర్సయ్య , సీసీ సంతోష్ , విఓఏ నవభారతి  వి ఓ అధ్యక్షురాలు గుర్రాల వనిత తదితరులు పాల్గొన్నారు.

చిట్టాపూర్ లో…

చిట్టాపూర్ గ్రామంలో చేపడుతున్న వయోజన విద్యా శాఖ అక్షర వికాసం మహిళాలకు ఉల్లాస్ పరీక్షలు విఓలు నిర్వహించారు.ఈ పరీక్ష కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ సంపతి శంకరమ్మ ,ఉప సర్పంచ్ బాల్సని ప్రణయ్ గౌడ్ సందర్శించారు. అనంతరం మహిళాలతో మాట్లాడి వారికి అక్షర వికాసం పట్ల అవగాహన కల్పించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular