ఘనంగా 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
నవగీతం, పెద్దపల్లి:
సమాజమే దేవాలయం,ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీది ఘనమైన చరిత్ర అని టీడీపీ జిల్లా అద్యక్షుడు అక్కపాక తిరుపతి అన్నారు.టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి దేవాలయం వద్దగల ఎన్టీఆర్ విగ్రహానికి తిరుపతి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం టీడీపీ కార్యాలయం వద్డ తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా అద్యక్షుడు అక్కపాక తిరుపతి పలువురు పార్టీ నాయకులతో కలిసి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం పార్టీ జెండా ఎగురవేసి,కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా అక్కపాక తిరుపతి మాట్లాడుతూ దేశ రాజకీయ రంగంలోకి తారాజువ్వలా దూసుకువచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగు బావుటాను ఎగురవేసిన యుగపురుషుడు నందమూరి అని, పేదల జీవితాలకు పెన్నిధిగా, అన్నదాతలకు ఆశాదీపంగా, ఆడపడుచులకు అన్నగా,బడుగుల సంక్షేమానికి వినూత్న పథకాలెన్నో తెచ్చిందన్నారు. తెలుగుజాతికి మార్గదర్శం చేసి,రాష్ట్ర ప్రగతి, ప్రజారంజక పాలన చేసిన మహానాయకుడు ఎన్టీఆర్, నీతివంతమైన రాజకీయాలతో దేశంలోనే ప్రాంతీయ పార్టీ లకు సముచిత గౌరవాన్ని,భాగస్వామ్యాన్ని కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని అన్నారు.

ప్రజల ఆకాంక్షల మేరకు పార్టీ ప్రణాళికను రూపొందించి, 44దశాబ్దాలుగా పేదరికం నిర్మూలన,బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని అన్నారు.ఎస్సీ, ఎస్టీ,బీసీ మరియు ఇతర వెనుకబడిన తరగతులకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని వారు పేర్కొన్నారు.తెలంగాణ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ తన పూర్వ వైభవాన్ని చాటుకుంటుందని,రాబోయే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.వివిధ పార్టీల్లో ఇబ్బందులు పడుతున్న బీసీ నేతలు,కార్యకర్తలు తిరిగి తమ సొంత గూడైన తెలుగుదేశం పార్టీలోకి రావాలని,పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ కార్యదర్శి,అసెంబ్లీ ఇన్చార్జ్ కోల కిషన్ రావు, నాయకులు కోప్పుల మురళి, అక్కపాక చంద్రయ్య,పెర్క శ్రీనివాస్ తోపాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


