ముఖ్యఅతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్
నవగీతం, వైరా :
గ్రామీణ ప్రాంతీయ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంగా స్కూల్ యాజమాన్యలు పనిచేయాలని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని వైరా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కట్ల సంతోష్ సూచించారు. పరుచూరి గార్డెన్‌లో నిర్వహించిన విజ్ఞాన్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజ్ఞాన్ పాఠశాల విద్యా సంస్థల నిర్వాహకులు జయప్రకాష్, మున్సిపల్ చైర్మన్ కాపు చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 17 ఏళ్లుగా విజ్ఞాన్ విద్యాసంస్థలను ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థులు చదువులతో పాటు వివిధ యాక్టివిటీస్‌పై దృష్టిసారించాలని సూచించారు.తల్లిదండ్రులు పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని, సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలని సూచించారు.అనంతరం విద్యా సంస్థల యాజమాన్యులు జయప్రకాష్ మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చేందుకు కృషి చేస్తున్నాము. ప్రతి ఏటా నవోదయ కి ఐదు నుంచి పది సీట్లు వచ్చే విధంగా విద్యార్థులకు విద్యను అందిస్తున్నాము.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జయప్రకాష్, మున్సిపల్ చైర్మన్ కాపా చంద్రకళ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ కేజీ సిరిపురం గ్రామ సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు, లక్ష్మీపురం గ్రామ మాజీ ఉప సర్పంచ్ మల్లు రామకృష్ణ, సారిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

