నవగీతం, మెట్ పల్లి:
మెట్ పల్లి మార్కండేయ భవనంలో ఆదివారం నిర్వహించిన పట్టణ పద్మశాలి సంఘం సమావేశంలో పట్టణ పద్మశాలి సంఘం అడ్‌హాక్ కమిటీ చైర్మన్‌గా గంగుల సంతోష్ కుమార్ ను ఎన్నుకున్నారు.గత కమిటీ పదవీ కాలం ముగియడంతో ఆ కమిటీని రద్దు చేస్తూ సంఘం కార్యకలాపాలను, దేవాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు, రాబోయే ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు నూతన అడ్‌హాక్ కమిటీని ఎన్నుకున్నారు.ఈ అడ్‌హాక్ కమిటీకి చైర్మన్‌గా గంగుల సంతోష్ కుమార్, సలహాదారులుగా సాంబారి ప్రభాకర్, గుంటుక విష్ణు, కేసుల సురేందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .అడ్‌హాక్ కమిటీ సభ్యులుగా జిల్లా వెంకటేశ్వర్లు, ధర్మపురి వేణుగోపాల్, గుంటుక సదాశివ్, చిలువేరి హన్మండ్లు, సంకు ఆనంద్, భీమనాథి సత్యం, మామిడాల శంకర్, సాంబారి శ్రీనివాస్, జోగ జగదీశ్వర్, పోతు సత్యనారాయణ, ఆడెపు రమణ, బోగ రాజగంగారాం, మ్యాన సతీష్, జోగ రాజగంగారాం, బండి రవి, పోతు సత్యనారాయణ, అందె గంగాధర్, అన్నారపు వంశీ, మరియు గాజెంగి రాజన్న ను ఎన్నికయ్యారు. ఉగాది వేడుకలను నూతన అడ్‌హాక్ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.సంఘం మరియు మార్కండేయ మందిర పర్యవేక్షణ బాధ్యతలను ఇకపై ఈ కమిటీయే చూసుకుంటుందని నాయకులు వెల్లడించారు.
అడ్ హక్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం

ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికలలో 7వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన ధర్మపురి స్వరూప వేణుగోపాల్ ని అడ్‌హాక్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, వివిధ వార్డుల అధ్యక్షులు మరియు సుమారు 150 మంది సంఘ సభ్యులు పాల్గొని తమ మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారు. సంఘం మరియు మార్కండేయ మందిరం నిర్మాణ బాధ్యత లను ఇకపై ఈ అడ్ హాక్ కమిటీ యే పర్యవేక్షిస్తుందని పద్మశాలి 26 వార్డు ల నాయకులు తెలిపారు.

