నవగీతం, చొప్పదండి:
చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో స్వశక్తి మహిళా సంఘాల నూతన భవనాల నిర్మాణానికి స్థానిక నాయకులు మహిళలతో కలిసి చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం భూమి పూజ చేశారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని వారిని గౌరవించుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, రుక్మాపూర్ సర్పంచ్ కర్రె ప్రేమలత శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ పెరుమండ్ల మానస గంగయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్ ,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నీజానాపురం చందు,జిల్లా కిసాన్ జిల్లా అధ్యక్షులు రాజేశం, మున్సిపల్ కౌన్సిలర్లు, స్వశక్తి సంఘం మహిళలు, వివిధ గ్రామాల సర్పంచులు,మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

