Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలసిసి కెమెరాలు ప్రారంభించిన డిఎస్పి రాములు, మున్సిపల్ చైర్మన్ లింబాద్రి

సిసి కెమెరాలు ప్రారంభించిన డిఎస్పి రాములు, మున్సిపల్ చైర్మన్ లింబాద్రి

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి

మెట్ పల్లి పట్టణంలో 26వ వార్డు కౌన్సిలర్ బీజెపి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో 26వ వార్డు అన్ని వీధుల్లో సీసీ కెమెరాలు అమర్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెట్ పల్లి డిఎస్పీ రాములు మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి సీఐ అనిల్ , ఎస్సై కిరణ్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ పాల్గొని సీసీ కెమెరాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ డిఎస్పి రాములు మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ ప్రజలకు అన్నివేళలా నిఘా నేత్రాలుగ ఈసీసీ కెమెరాలు పనిచేయడం జరుగుతుందని ఈ సీసీ కెమెరాల ద్వారా వీధిలో చైన్ స్నాచిoగ్, ఇవిటీజింగ్, దొంగతనాలు జరిగే క్రమంలో ఈ కెమెరాల ద్వారా పోలీస్ శాఖకు త్వరగా నిందితులను పట్టుకొని కేసులను చేదించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొడ్ల ఆనంద్, ధర్మపురి స్వరూప వేణు నాయకులు బొడ్ల రాహుల్ సుంకేటి విజయ్ సతీష్ బొడ్ల గౌతం అజిత్ సంజీవ్ అంజయ్య జెట్టి రూపేష్ శ్రీకాంత్ లత లక్ష్మి రాజు భాయ్ హరిత వార్డు ప్రజలు మహిళ సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular