Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఅంగన్వాడీ కేంద్రంలో పోషక ఆహారం పై అవగాహన

అంగన్వాడీ కేంద్రంలో పోషక ఆహారం పై అవగాహన

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల పట్టణ కేంద్రంలోని వార్డు నెంబర్ 32 చింతకుంట వాడ అంగన్వాడీ కేంద్రంలో పోషక ఆహారం ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ బడుగు పద్మ రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై గర్భిణీ స్త్రీలు బాలింతలు మరియు చిన్నారుల తల్లులకు పోషకాహారం పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ బడుగు పద్మ రాజేందర్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సరైన పోషకాహారం ఎంతో అవసరమని , పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు.అంగన్వాడీ సిబ్బంది కూడా తల్లులకు పోషకాహారపు అలవాట్లు, స్వచ్ఛత, పిల్లల సంరక్షణపై పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించడం ద్వారా గ్రామ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular