Wednesday, April 22, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకొండగట్టు అంజన్న ఆలయంలో అంతర్గత బదిలీలు,ప్రమోషన్లు

కొండగట్టు అంజన్న ఆలయంలో అంతర్గత బదిలీలు,ప్రమోషన్లు

📰 Generate e-Paper Clip

ఆలయ కార్యనిర్వాహణ ఆధికారి అంజన రెడ్డి

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనేయ స్వామి దేవస్థానంలో ఉద్యోగుల అంతర్గత బదిలీలు,ప్రమోషన్లను అమలు చేస్తూ ఆలయ ఈఓ అంజనారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు డి. సునీల్ కుమార్‌ను సూపరింటెండెంట్‌గా నియమిస్తూ పరిపాలన విభాగం, లీగల్, లీజులు, లైసెన్సులు, కోర్టు కేసులు, భూములు, ప్రసాదం, అకౌంట్స్, మనీవాల్యూ, ఇంజనీరింగ్, సిబ్బంది విధి నిర్వహణ, బుకింగ్ కౌంటర్లు, దేవాలయ విభాగాల పర్యవేక్షణతో పాటు అన్నదాన కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.యు. చంద్రశేఖర్‌కు సీనియర్ అసిస్టెంట్ పదవి నుంచి సూపరింటెండెంట్‌గా ప్రమోషన్ కల్పించి దేవాలయ పర్యవేక్షణ, పీఆర్‌ఓ, పారిశుద్ధ్యం, గదుల విచారణ కార్యాలయం, ఉప ఆలయాలు, కళ్యాణకట్ట నిర్వహణతో పాటు హోంగార్డులు, సెక్యూరిటీ గార్డుల విధుల పర్యవేక్షణ, వాహన పూజల నిర్వహణ బాధ్యతలు ఇచ్చారు.యాదగిరిగుట్ట నుంచి బదిలీపై వచ్చిన ఎస్. పవన్ కుమార్ (సీనియర్ అసిస్టెంట్) కు పరిపాలన, అకౌంట్స్ విభాగాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. టి. ధర్మేందర్ (జూనియర్ అసిస్టెంట్) కు ప్రసాదాల విభాగం, తూమ్ శ్రీనివాస్ (జూనియర్ అసిస్టెంట్) కు దేవాలయ ఇన్స్పెక్టర్ బాధ్యతలు ఇచ్చారు.టి. అశోక్ (రికార్డు అసిస్టెంట్) కు అన్నవితరణ, విరాళాల సేకరణ బాధ్యతలు, కె. రాము (రికార్డు అసిస్టెంట్) కు మనీవాల్యూ, స్టేషనరీ, రికార్డుల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.ఇదిలా ఉండగా, చంద్రశేఖర్ సూపరింటెండెంట్‌గా ప్రమోషన్ పొందిన సందర్భంగా ఆలయ అర్చక సంఘం తరఫున శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.స్థానాచారి కపిందర్ నేతృత్వంలోని అర్చక బృందం అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular