మేడిపల్లి ఎస్ ఐ శ్రీధర్ రెడ్డి
నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో ఆరైవ్ ఏ లైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీధర్ రెడ్డి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ట్రాపిక్ నియమాలు,రోడ్డు భద్రతా నిబంధనల గురించి అవగాహన కల్పించారు.అనంతరం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం,మద్యం సేవించడం, మొబైల్ ఫోన్ వినియోగం,ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వంటి అంశాలు అన్నారు.ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనం నడిపి, తమతో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడాలని పిలుపునిచ్చారు. చిన్న నిర్లక్ష్యలే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయని,అలాంటి సంఘటనలు కుటుంబాలకు నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాగండ్ల సంజన శ్రీనివాస్ ఆర్ అండ్ బి ఏ ఈ ఈ యశ్వంత్,ఆర్ ఐ రమేష్, జిపివో సువర్ణ,పంచాయతీ సెక్రెటరీ ఇసాక్,ఉప సర్పంచ్,వార్డు మెంబర్లు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

