ప్రముఖ జ్యోతిష్య పురోహితులు బెజ్జారపు కళ్యాణాచార్యులు
నవగీతం, కోరుట్ల ప్రతినిధి
జగిత్యాల సిరిసిల్ల,సిద్దిపేట ప్రాంతాల ఖ్యాతిని దశదిశలా చాటిన ప్రముఖ జనపద కళాకారుడు, సంగీత సాహిత్యవేత్త, ‘మిమిక్రీ ఆనందో బ్రహ్మ’ జడల రమేష్ ని కలవడం ఒక మధురమైన అనుభూతి అని ప్రముఖ జ్యోతిష్య పురోహితులు బెజ్జారపు కళ్యాణాచార్యులు కొనియాడారు. ఆదివారం కోరుట్ల పట్టణంలోని జడల శ్రీనివాస్ నూతన గృహప్రవేశం సందర్భంగా విచ్చేసిన జడల రమేష్ ని కళ్యాణాచార్యులు దంపతులు ఆప్యాయంగా కలిసి, వారిని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కళ్యాణాచార్యులు మాట్లాడుతూ.. జడల రమేష్ కళా ప్రస్థానాన్ని కొనియాడారు. గత మూడు దశాబ్దాలుగా సంగీత, సాహిత్య రంగాల్లో నిరంతర విద్యార్థిలా కృషి చేస్తూ, తెలుగు జానపద కళకు జడల రమేష్ ప్రాణం పోస్తున్నారు.అంజన్న స్వామి చరిత్ర, అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర, శ్రీశైల మల్లన్న మరియు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వంటి పుణ్యపురుషుల చరిత్రలను తన గాత్రంతో వీనులవిందుగా ప్రజలకు అందించిన ఘనత ఆయనది పాటలు రాయడం, పాడటమే కాకుండా.. సంగీతం సమకూర్చడంలో మరియు మిమిక్రీ కళలో ఆయనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. జడల రమేష్ తన గాత్రంతో, రచనలతో తెలంగాణ సంస్కృతికి ఎనలేని సేవ చేస్తున్నారు. మేము మొదటి నుండి వారి అభిమానులమే కావడం మా అదృష్టం అన్నారు.

