Tuesday, April 14, 2026
ads
Homeజిల్లా వార్తలుహైదరాబాద్బీసీ గురుకులంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

బీసీ గురుకులంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

నవగీతం,పఠాన్ చెరు:

పఠాన్ చెరు మండలంలో చిన్న కంజర్ల గ్రామంలోని బీసీ గురుకుల మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాల,కళాశాలలో జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు ఘనంగానిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ బి. స్రవంతి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రిన్సిపాల్ స్రవంతి మాట్లాడుతూ..సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా వికాసం కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు మహాత్మ జ్యోతి రావు పూలే బాలికల విద్యా కు శ్రీకారం చుట్టి, అణగారిన వర్గాల అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. ఆయన ఆశయాలు మన సమాజానికి శాశ్వత ప్రేరణగా నిలుస్తాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీపీ శ్రీకాంత్ రెడ్డి,మరియు ఉపాధ్యాయులు,స్వర్ణ, స్వప్న నాగరాజు, విజయ్ కూమర్, క్రిష్ణ పవర్,మహేందర్ రెడ్డి,నాగేష్,మహేష్, శిరీష,ఫారిన,అమ్రిన్, శ్రావ్య, ప్రాణహిత,నజురుద్దీన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular