Monday, April 27, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలరైతులు వరి కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి:

రైతులు వరి కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి:

📰 Generate e-Paper Clip

మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదం వినోద్ యాదవ్

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారుల వద్ద అమ్మి నష్టపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదం వినోద్ యాదవ్ సూచించారు.రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు మేడిపల్లి, భీమారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి లతో కలిసి ఐకెపి మరియు పిఎసిఎస్ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
మచాపూర్, కల్వకొట, మన్నెగూడెం, గోవిందారం, మోత్కురావుపేట, రాజలింగంపేట, కమ్మరిపేట, ఒడ్యాడ్ గ్రామాల్లో ఈ కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా మాదం వినోద్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు సరైన ధర లభిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని కోరారు. రైతును రాజుగా నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు రోజా నాగరాజ్, గుగ్గిళ్ల రమేష్, దుంపల నివేదిత, పుల్లురి ఉమరణి-దేవయ్య, ఏనుగుల లచ్చన్న, గాజోజి చారి, కోటగిరి గంగరాజు, బొమ్మెన ప్రశాంత్, జిల్లా నాయకులు ఉరుమట్ల లక్ష్మన్, నీరటి మల్లేశం, మండల ఉపాధ్యక్షులు తోకల నర్సయ్య, సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ సభ్యులు సురకంటి రాజారెడ్డి, ఆయిత మోహన్, యువకులు మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular