నవగీతం,కోరుట్ల ప్రతినిధి :
కోరుట్ల పట్టణం స్థానిక 4వ వార్డు అంబేద్కర్ నగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఏంపిపిఎస్ లో వీడ్కోలు వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి.పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ప్రత్యేక ఆహ్వానం మేరకు 4వ వార్డు కౌన్సిలర్ తెడ్డు శ్రీజ విజయ్ కుమార్ ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ..విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలని, క్రమశిక్షణతో కూడిన విద్యే ఉన్నత భవిష్యత్తును ఇస్తుందని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, విద్యా ప్రమాణాల మెరుగుదలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దుతున్న తీరును ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులకు వారి ఉజ్వల భవిష్యత్తును కోరుతూ కౌన్సిలర్ శుభాకాంక్షలు తెలిపారు.తాను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలకు తానే నేడు ముఖ్య అతిథిగా ఆహ్వానం రావడం చాలా ఆనందంగా ఉంది అని విజయ్ కుమార్ భావోద్వేగానికి లోనయ్యారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, వార్డు ప్రముఖులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


