నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జరిగిన వీడ్కోలు సమావేశంలో బీ.ఏ ప్రథమ సంవత్సరం “రెండవ సెమిస్టర్ కు సంబంధించిన స్థూల అర్థ శాస్త్రం” అనే పుస్తకాన్ని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య అధ్వర్యంలో కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, బీ.ఏ రెండవ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు ఈ పుస్తకం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం చైర్మన్ డాక్టర్ మీనయ్య నేతృత్వంలో ఫోరం సభ్యులు ఈ పుస్తకాన్ని చాలా చక్కగా రచించారని ఆయన గుర్తు చేశారు. “స్థూల అర్థ శాస్త్రం – ఉపోద్ఘాతం” అనే యూనిట్ ను రచించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, అందుకు చైర్మన్ మీనయ్యకు ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న, కళాశాల అకాడమిక్ కో-ఆర్డినేటర్ బిల్ల రాజేందర్, లెక్చరర్లు అంజయ్య, శ్రీకాంత్, సత్య శోధన్, దశరథం, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

