Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఏజెన్సీ భూముల్లో పార్టేషన్ల దందా..?

ఏజెన్సీ భూముల్లో పార్టేషన్ల దందా..?

📰 Generate e-Paper Clip

నవగీతం,మంచిర్యాల జిల్లా ప్రతినిధి:

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఏజెన్సీ భూముల అక్రమ పార్టేషన్ల వ్యవహారం కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యదేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ పార్టేషన్ల వెనుక ఓ దళారి గుట్టుచప్పుడు కాకుండా కీలక పాత్ర పోషిస్తున్నాడని స్థానికులు చర్చించుకుంటున్నారు.దండేపల్లి మండలంలోని కొన్ని ఏజెన్సీ గ్రామాల్లో కేవలం ఎస్టీలకు మాత్రమే చెందాల్సిన భూములను 1/70 చట్టానికి తూట్లు పొడుస్తూ 103 సర్వే పరిధిలో ఇతర కులాలకు చెందిన కొంతమందికి అక్రమ పార్టీషన్లు నిర్వహించినట్లు పలుమార్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ అంశంపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఉన్నతాధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడంపై ఎస్టీ సంఘాల నాయకులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్రమ పార్టేషన్లపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular