Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకిషోర బాలికల ఆరోగ్య అవగాహన సదస్సు​ ​

కిషోర బాలికల ఆరోగ్య అవగాహన సదస్సు​ ​

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా సోమవారం మెట్‌పల్లి పట్టణంలోని సాయిరాం కాలనీలో గల పట్టణ ఆరోగ్య కేంద్రం (UPHC) లో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల కిషోర బాలికల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ఆడపిల్లల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ప్రగతి ప్రణాళికను అమలు చేస్తోందని, కిషోర బాలికలు రక్త హీనత,రక్త పరీక్షలు, డయాబెటిస్ వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం మరియు HPV వ్యాక్సిన్ గురించి అవగాహన,తమ ఆరోగ్యం, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, వార్డు కౌన్సిలర్ పందిరి రమేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ అంజిత్ రెడ్డి, మరియు మున్సిపల్ అధికారులు సిబ్బంది, స్థానిక వైద్య సిబ్బంది ఆర్ పి లు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular