Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలధాన్యం కొనుగోలులో జాప్యం జిల్లా అధికారుల నిర్లక్ష్యమే

ధాన్యం కొనుగోలులో జాప్యం జిల్లా అధికారుల నిర్లక్ష్యమే

📰 Generate e-Paper Clip

భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు భూమారెడ్డి

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని భారత్ మాత కూడలి వద్ద రోడ్డుపై ధర్నాకు దిగిన రైతులు, భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు గన్ని బ్యాగుల కొరతను, లారీల కొరతను, హలీల కొరత , మిల్లర్ల దోపిడీపై చర్యలు లేకపోవడం చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యంతో పాటు అనుమానాలకు తావిస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు కాసారపు భూమారెడ్డి మాట్లాడుతూ పంట చేతికి రాకంటే ముందు ఎన్నోసార్లు ఎమ్మార్వో కి, కలెక్టర్ కి పదుల సంఖ్యలో వినతి పత్రాలు అందజేయడం జరిగింది రైతుల పక్షాన ముందస్తు ప్రణాళికతో ధాన్యం కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగకుండా అలాగే త్వరితగతిన జరిపేలా చర్యలు తీసుకోండి అని పలుమార్లు వినతి పత్రాలు అందించినప్పటికిని జిల్లా అధికార యంత్రాంగం తు తు మంత్రంగా తనిఖీలు చేయడమే కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. రైతును కష్టపెట్టిన ఏ అధికారి బాగుపడడు మా తర్వాత తరం రైతు గా ఉండడానికి పంట పండించడానికి సముఖంగా లేరు ఇది ఇలాగే కొనసాగితే తినడానికి తిండి లేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రైతు నాయకులు మోరపు గంగరాజం మాట్లాడుతూ మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో కనీస వసతులు లేవు దాదాపు రెండు నెలల నుండి రైతులు వివిధ గ్రామాల నుండి వస్తు వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీస వసతులు ఏర్పరచండి అని తెలియజేశారు. వాహనలు నిలిచిపోవడంతో రెవెన్యూ అధికారి అశోక్, మల్లాపూర్ ఎస్సై అనిల్ కుమార్ రైతులతో మాట్లాడి రేపటినుండి ధాన్యం కొనుగోలులో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత రైతులు ధర్నాని విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు రమేష్ రెడ్డి, ఆనందం, బద్దం హరీష్, తుక్కారెడ్డి, లింగారెడ్డి, ముత్యాల గంగరాజం, గోపిడి చిన్నారెడ్డి, మోహన్, రాజేందర్, నరేష్, రాజేశం, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular